వరంగల్లో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అధ్యాపకురాళ్లు పిలుపునిచ్చారు. చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కళాశాలలో జరిగిన వేడుకల్లో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్