ETV Bharat / state

Woman Dies of Heart Stroke Warangal : బిడ్డకు పాలిచ్చి.. నిద్రలోనే గుండెపోటుతో తల్లి మృతి - Women Died in Cardiac Arrest

Woman Dies of Heart Stroke Warangal : తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఆ మహిళ తన బిడ్డను ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. తొమ్మిది నెలలు.. పగలూ రాత్రి.. ప్రతీక్షణం తనకు పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచన. ఎట్టకేలకు తొమ్మిది నెలలు ముగిశాయి. బాబు పుట్టాడు. ఆ కుటుంబంలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆ తల్లి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అంతా సంబురం చేసుకుంటున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది. బాబుకు పాలిచ్చి నిద్రపోయిన ఆ తల్లి.. నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

Women Died in Cardiac Arrest
Mother Dies After Feeding Baby In Warangal
author img

By

Published : Aug 19, 2023, 12:48 PM IST

Woman Dies of Heart Stroke Warangal : మహిళలకు తల్లి అవుతున్నామంటే వచ్చే అనుభూతినే వేరు. ఎందుకంటే అప్పటివరకు ఒకరికి కూతురు ఉన్న ఆమె.. తాను కూడా అమ్మను కాబోతున్నాననే తెలిసిన తర్వాత ఆమె పడే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. గర్భంతో ఉన్న దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. తన పిల్లల భవిష్యత్​ కోసం అప్పటి నుంచే కలలు కనడం ప్రారంభిస్తుంది ఆ మహిళ. అప్పటివరకు కడుపులో దాచుకొని నవమాసాల తర్వాత బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అలా తన బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎన్నో కలలు కన్న ఆ తల్లి .. బిడ్డ పుట్టిన మూడ్రోజులకే హఠాత్తుగా కన్నుమూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత.. ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీన వరంగల్ జిల్లాలోని సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈనెల 16వ తేదీన ఆమెకు పండింటి మగబిడ్డకు జన్మినిచ్చింది. మగ పిల్లాడు పుట్టాడన్న ఆనందంలో ఆ కుటుంబం సంబురాల్లో మునిగిపోయింది. సుస్మిత కూడా ఎంతో అపురూపంగా తన బిడ్డను చూసుకుంటూ ఎంతో సంబురపడింది. అయితే ఆ బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావడంతో.. ఆసుపత్రిలో నవజాత శిశుసంరక్షణ కేంద్రం(SNCU)లో ఉంచారు డాక్టర్లు. అక్కడే పిల్లాడికి తల్లి పాలుపడుతూ ఉండేది.

Woman Died Of Cardiac Arrest After Feeding Baby : ఎప్పటిలాగే సుస్మిత శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బిడ్డకు పాలు ఇవ్వడానికి.. ఆసుపత్రిలోని సీమాంక్​ వార్డుకు వెళ్లింది. తన బిడ్డకు పాలిచ్చి ఆ తర్వాత పక్కనే ఉన్న తన వార్డులోకి వెళ్లి పడుకుంది. ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. ఎంతకీ నిద్ర లేవకపోయేసరికి ఆందోళన చెంది ఆసుపత్రిలోని వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వైద్యులు సుస్మితను పరిశీలించారు. ఆమె రాత్రి నిద్రలోనే కార్టియాక్​ అరెస్టు(Cardiac Arrest) వచ్చినట్లు గుర్తించారు. ఆలస్యమైందని తెలిసినా.. సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆమె చనిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. సుస్మిత నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరణించిన తల్లి సుస్మిత
మరణించిన తల్లి సుస్మిత

Mother Dies Of Cardiac Arrest After Feeding Baby Warangal : బిడ్డ పుట్టిన మూడ్రోజులకే తల్లి మరణించడంతో ఆ బాబు తల్లిలేని పిల్లాడయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మగపిల్లాడు పుట్టాడని ఎంతో సంబుర పడ్డామని ఇంతలోనే తమ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని రోదించారు. తల్లిలేని లోటు ఆ బిడ్డకు ఎవరు తీర్చుతారంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Cutting of Trees on National Highway 563 : రహదారి విస్తరణ.. వృక్షాలకు మరణదండన..

Response on ETV BHARAT Story : ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. శవ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.