వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్‌కు చెందిన రజిత అదే కాలనీకి చెందిన మంజుల వద్ద అవసరాల నిమిత్తం 50 వేల రూపాయలను 10 శాతం వడ్డీతో అప్పుగా తీసుకుంది. 20 నెలల పాటు వడ్డీ చెల్లించిన రజిత లాక్డౌన్ కారణంగా వడ్డీ చెల్లించడం మానేసింది. చాలా రోజులుగా వడ్డీ కట్టకపోవడం వల్ల కోపోద్రిక్తురాలైన మంజుల... రజిత ఇంటికి చేరుకొని నానా హంగామా చేసింది.
అందరి ముందు తన పరువు పోయిందని భావించిన రజిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా రైల్వే స్టేషన్‌కి చేరుకొని పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన రైల్వే సిబ్బంది అడ్డుకొని వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. రజిత ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారి మంజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'