వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గీసుగొండ, సంగెం మండల పరిధిలోని 40 మంది లబ్ధిదారులకు సుమారు 45 లక్షల రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
వెలుగులు నింపడమే లక్ష్యం..
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే చల్లా కొనియాడారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ఆయన స స్పష్టం చేశారు.