వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి డీసీసీబీ ఛైర్మన్ రవీందర్, తెరాస శ్రేణులు పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలకు నిధులు విడుదల చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొస్తూ.. వారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తూ అన్నదాతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.