వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందచేశారు.
సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని ఎర్రబెల్లి అన్నారు. తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీల పనితీరులో గుణాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత పై దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రంగాల్లో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందడం హర్షదాయకమని దయాకర్ రావు అన్నారు. మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఇదీ చూడండి :వరంగల్ నిట్లో వృక్షాబంధన్