ETV Bharat / state

ఎవరింట్లో వారే బతుకమ్మ పండుగ జరుపుకోవాలి: కలెక్టర్ హనుమంతు

బతుకమ్మ సంబురాలు ఎవరింట్లో వారే జరుపుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కరోనా వ్యాపిస్తున్నందున మహిళలు.. తమ నిర్ణయానికి మద్దతునిచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు.

warangal urban district collector rajiv gandhi
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
author img

By

Published : Oct 16, 2020, 1:50 PM IST

రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాలో అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడు ప్రజలంతా ఎవరి ఇళ్లలో వారే పండుగను జరుపుకోవాలని సూచించారు. దీనికి వరంగల్ జిల్లా మహిళలంతా సహకరించాలని కోరారు.

లాక్​డౌన్5.0 అమల్లో భాగంగా.. 100 మంది కంటే ఎక్కువగా ప్రజలు గుమిగూడకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. అందువల్లే ఉత్సవాలు, పండుగలు పరిమిత సంఖ్యలో కూడిన జనంతో జరుపుకోవాలని చెప్పారు. ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఇంట్లో బతుకమ్మ ఆడే సమయంలోనూ.. మాస్కు ధరించి, శానిటైజర్లు ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.