వరంగల్ త్రినగరిలోని కూడళ్లను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్ ఛాంబర్లో కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ గ్రేటర్ కమిషనర్ పమేల సత్పతి, పురపాలక శాఖ మంత్రి, ఉద్యనవనాల ఓఎస్డీ కృష్ణతో కలసి జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణపై ఆయన సమీక్షించారు.
ఉద్యనవనాల ఓఎస్డీ జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా రూపొందించిన నమూనాలను కలెక్టర్‌కు వివరించారు. వరంగల్ త్రినగరిలోని ఉర్స్, సీఎస్ఆర్, వెంకట్రామ, పోచమ్మ మైదాన్, మడికొండ తదితర జంక్షన్లను వినూత్నంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటర్ ఫౌంటేన్, వెలుగులు విరజిమ్మే లైటింగ్‌తో పాటు ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆయా సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: 'నూతన సాగు చట్టాలతో మాకు ఎలాంటి ప్రయోజనం లేదు'