2020-21 సంవత్సరానికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిన కేసీఆర్ సర్కార్ వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇంత వరకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో తెలపాలని వరంగల్ అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు.
గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతుండటం వల్లే ప్రజలను మభ్య పెట్టేందుకు మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన చేస్తున్నారని రావు పద్మ మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నగరంలో పర్యటించి.. ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులను ఎందుకు ఆహ్వానించరని అడిగారు.