వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను విన్నవించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎక్కువగా భూసమస్యలు, పింఛన్లు, సదరన్ సర్టిఫికెట్ల బాధితులు తమ సమస్యలను పరిష్కరించమంటూ కలెక్టర్‌కు విన్నవించారు.
ఇదీచూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'