వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో తాగునీటి వసతి కల్పించాలని కోరారు.
తమ కళాశాలలో సాంకేతిక విద్యను అందించే ల్యాబ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ కళాశాల భవనాన్ని వేరే చోటుకు మార్చాలని లేకపోతే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని టీఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.
- ఇదీ చూడండి: అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి