నవంబర్ చివరి నాటికి ప్రతిరోజు తాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎల్, బల్దియా ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
నగరంలో మంచినీటి సరఫరా సమస్యలపై కూలంకషంగా చర్చించి సమస్యలను అధిగమించి అన్ని ఆవాసాలకు ప్రతి రోజు మంచినీరు అందించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యాన్ని వీడి అంకితభావంతో కలసికట్టుగా పబ్లిక్ హెల్త్, ఆర్ డబ్ల్యూ ఎల్, బల్దియా ఇంజినీరింగ్ ఆధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి రోజు తాగు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు గాను పబ్లిక్ హెల్త్, బల్దియా ఇంజినీరింగ్ అధికారులు వారం రోజులు పంపింగ్, పంపిణీపై ట్రయిల్ రన్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.
- ఇదీ చదవండి:సామాన్య మహిళల అసామాన్య పోరాటం