వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో మొదటిసారిగా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా తొలిసారిగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
సుదీర్ఘ చర్చ అనంతరం బడ్జెట్ను సభ్యులు ఆమోదించినట్లు మేయర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం అత్యవసర పరిస్థితుల్లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ను ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు.