ETV Bharat / state

కైట్​ ఫెస్టివల్​కు తగిన ఏర్పాట్లు చేయాలి : బల్దియా కమిషనర్​ - warangal municipal commissioner latest news

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న హన్మకొండలోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కళాశాల మైదానంలో కైట్​ ఫెస్టివల్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రేటర్​ వరంగల్​ కమిషనర్​ పమేలా సత్పతి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కైట్​ ఫెస్టివల్​ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

warangal municipal commissioner, kite festival, hanmakonda
వరంగల్​ మున్సిపల్​ కమిషనర్​, కైట్​ ఫెస్టివల్​, హన్మకొండ
author img

By

Published : Jan 13, 2021, 1:24 PM IST

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ నెల 15న వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్​ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించే కైట్ ఫెస్టివల్​కు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై కార్యాలయంలో.. అధికారులతో సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షన్- 2021 బ్యానర్లు, ప్రాంగణంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైదానం పరిశుభ్రంగా ఉంచాలని సీ‌ఎం‌హెచ్‌ఓను ఆదేశించారు. సభ వేదిక, వీ‌ఐపీ గ్యాలరీలు తదితర వాటిని స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి ఏర్పాటు చేయాలని సూచించారు.

విజయవంతం చేయాలి

15న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్లో, ఫాస్ట్ సైక్లింగ్, అనంతరం మధ్యాహ్నం 2 వరకు కైట్ ఫెస్టివల్, 4 వరకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ప్రజలు, అధికారులు, యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.

ఇదీ చదవండి: కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.