ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ విధిగా జరగాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి.. స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే తరలించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి కోరారు. బాలసముద్రంలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలోని చెత్తను ఆమె స్వయంగా తీసి స్వచ్ఛ ఆటోలో వేశారు.
చెత్తను సేకరించేందుకు ప్రతి 500 ఇళ్లకు ఒక స్వచ్ఛ ఆటో చొప్పున గ్రేటర్ వరంగల్ పరిధిలో 164 చెత్త తరలించే ఆటోలను అందుబాటులో ఉంచామని అన్నారు. కార్పొరేషన్ నుండి స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు ఎలాంటి భత్యాలు చెల్లించడం లేదని, ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకొని వెళ్లినందుకు గానూ స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు ప్రతినెల ఇంటికి 60 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాలని నగర ప్రజలను కమిషనర్ కోరారు.
ఇదీ చదవండి: నూతన విద్యా విధానంతో భారత్కు విశ్వగురువు స్థానం: గవర్నర్