వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలంయంలో మేయర్ గుండా ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మేయర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేసిన కృషికి సంఘీభావంగా మేయర్ నేతృత్వంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం