.
కిలిమంజారో పర్వతశిఖరాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన అఖిల్ అధిరోహించాడు. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతం ఎత్తు 5895 మీటర్లు.
మైనస్ 20 డిగ్రీల్లోనూ...
అధిరోహణ చేయాలనే లక్ష్యం ముందు అక్కడి ఉష్ణోగ్రతలు అఖిల్‌ను కొంచెం కూడా ఆపలేకపోయాయి. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పర్వతం ఎక్కి విజయం సాధించాడు.
కిలిమంజారోపై కేసీఆర్
పర్వతారోహణ తర్వాత అఖిల్ భారతదేశ త్రివర్ణ పతాకంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ఎగురవేశాడు. ఈ ఘనత సాధించినందుకు అఖిల్‌పై అభినందనలతో పర్వత జాతీయ పార్క్ అధికారులు, తెలుగు ప్రజలు ముంచెత్తారు.