ప్రతి ఇంటికి ఫిబ్రవరి నుంచి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో పాటు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆయన సమన్వయ సమావేశం జరిపారు.
త్రినగరిలో అమృత్ పథక పురోగతిని సమీక్షించిన కలెక్టర్, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: సంస్కరణలను వ్యతిరేకించడం విడ్డూరం: వివేక్