ETV Bharat / state

మెడికల్ హబ్‌గా ఓరుగల్లు.. వేగంగా అడుగులు - వరంగల్​ ఎంజీఎం వార్తలు

చారిత్రక నగరి ఓరుగల్లు... మెడికల్ హబ్‌గా మారేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులో ఉండగా... తాజాగా జైలు ప్రాంగణంలో అధునాతన వసతులతో మరొకటి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లా ప్రజలకే కాకుండా పొరుగు జిల్లాలవాసులకూ మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

warangal medical hub
మెడికల్ హబ్‌గా ఓరుగల్లు
author img

By

Published : Jun 1, 2021, 11:28 AM IST

మెడికల్ హబ్‌గా ఓరుగల్లు

రోగి పరిస్ధితి కాస్త విషమిస్తే... హైదరాబాద్ తీసుకెళ్లండని వైద్యులు చెప్పడం.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం పరిపాటి. హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోవడమంటే లక్షలతో కూడుకున్న పని. ఇకపై హైదరాబాద్ వెళ్లకుండా.. పైసా ఖర్చు కాకుండా.. అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు... వరంగల్‌లో అందుబాటులోకి రానున్నాయి.

అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..

ఇప్పటికే పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎం ఉత్తర తెలంగాణకే వరప్రదాయనిగా నిలుస్తోంది. పది రోజుల క్రితం వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఎంజీఎంను సందర్శించి ఆస్పత్రి అభివృద్ధిపై సమీక్షించారు. రోగులకు తగ్గట్లుగా ఆస్పత్రి సరిపోకపోవటంతో వరంగల్ కేంద్ర కారాగారాన్ని తరలించి... అక్కడ 73 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. మంత్రివర్గం ఆమోదించడంతో నెలరోజుల్లోనే అక్కడి నుంచి కేంద్ర కారాగారం తరలనుంది. నేటి నుంచి ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లి జైలు సహా ఇతర కారాగారాలకు పంపనున్నారు.

మెడికల్ హబ్‌గా ..

నెలరోజుల్లోనే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. కేంద్ర కారాగారం సమీపంలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తే... పక్కనే కాకతీయ వైద్య కళాశాల ఉండడంతో వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోనే పీఎంఎస్​ఎస్​వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. రూ.150 కోట్ల వ్యయం, 250 పడకల సామర్థ్యం, అత్యాధునిక వసతులు, 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఎంజీఎం మాతా శిశు సంరక్షణ కేంద్రంగా ఇకపై సేవలందించనుంది. ఎంజీఎం, కాళోజీ వర్శిటీ, పీఎంఎస్​ఎస్​వై ఆస్పత్రి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, మాతా శిశు సంరక్షణా కేంద్రం... అన్నీ ఒకే చోట ఉండి వైద్య సేవలందించడం ద్వారా ఓరుగల్లు మెడికల్ హబ్‌గా మారనుంది.

పక్కా వైద్యం..

కేఎంసీకి అనుబంధంగా మరో రెండు ఆస్పత్రులను నిర్మించాలన్న ప్రతిపాదనలు ఎప్పట్నుంచో ఉన్నాయి. 120 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 250 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించాలన్న ప్రతిపాదనలూ ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే వైద్య సేవలకు తిరుగే ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆస్పత్రులో తగిన సంఖ్యలో వైద్యులను నియమిస్తే... రోగులకు అన్ని రకాల చికిత్సలు అందించే అవకాశం ఉంది. ఒక్క వరంగల్‌కే కాకుండా పొరుగు జిల్లాల ప్రజలకూ పక్కా వైద్యం అందనుంది.

ఇవీచూడండి: Anandaiah Medicine : ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.