తాటాకు చప్పుళ్లకు భయపడను...
రాష్ట్రాన్ని బారు, బీరుగా మార్చిన కేసీఆర్‌ని నమ్ముతారా... దేశాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తోన్న మోదీని నమ్ముతారా...అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. కరీంనగర్ సభలో తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు తెరాస కార్యకర్తను కాదని ధ్వజమెత్తారు.
దిల్లీలో మీ పప్పులుడకవు...
రాష్ట్రం దాటితే కేసీఆర్ చెల్లని రూపాయని లక్ష్మణ్ ఘాటుగా విమర్శించారు. హన్మకొండ విజయ సంకల్ప సభలో గులాబీ అధిపతిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 16 స్థానాలు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. మెడలు వంచటానికి కేంద్రంలో ఉండేది హరీశ్‌రావు కాదు..నరేంద్ర మోదీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిరాశపరిచిన అమిత్ షా...
కరీంనగర్, వరంగల్‌లో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనా....దళపతి అమిత్ షా హజరుకాకపోవడంతో శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధానితో సమావేశం కారణంగా రాలేదని కాషాయ వర్గాలు ప్రకటించాయి.
ఇవీ చూడండి:రాహుల్ నాయనమ్మ పాటే పాడుతున్నారు: కేసీఆర్