వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ వైద్య కళాశాలలో నూతనంగా వైరాలజీ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్య వెల్లడించారు. వైరస్ విజృంభించటం వల్ల ల్యాబ్ ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు తెలిపారు. 2013లో ప్రతిపాదనలు చేయగా ఇటీవల కాలంలో ఆమోదించినట్లు పేర్కొన్నారు.
కాకతీయ వైద్య కళాశాలలో గ్రేడ్-3 ల్యాబ్ అనుమతి దక్కిందని అందుకు సంబంధించిన వైద్య పరికరాలు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల నమూనాలను సేకరిస్తున్నామని రెండు రోజుల వ్యవధిలో పరీక్షలు పూర్తిస్థాయిలో చేస్తామన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూతో పాటు కరోనా ఇతర వైరస్‌లా పరీక్షలు చేస్తామని ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం