వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం గోదాముల్లో విత్తనాల కోసం రైతులు గుంపుగుంపులుగా తరలొచ్చారు. భౌతిక దూరం పాటించకుండా బారులు తీరారు. మరికొంత మంది మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు. రైతులకు అధికారులు కనీస జాగ్రత్త చర్యలు సూచించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్రంలో కరోనా వ్యాధి విజృంభిస్తోన్న పరిస్థితుల్లో కూడా రైతులకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాల్సిన అధికారులు ఇలా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు తగు సూచనలు చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!