సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తోన్న తెరాసపై చౌకబారు విమర్శలు మాని... ప్రజాక్షేత్రంలో ఉండి బలం పెంచుకోవాలని విపక్షాలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సూచించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో మీట్ ది ప్రెస్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక తరహా ప్రయోగాలు ఇక్కడ చెల్లవని భాజాపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కుట్రలు కుతంత్రాలకు ఇకనైనా స్వస్థి పలకాలని హితవు పలికారు. రాష్ట్రానికి నెలకొక కేంద్రమంత్రి వస్తారంటే... భయపడే వారెవరూ లేరన్నది భాజాపా నాయకులు తెలుకోవాలని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'