ETV Bharat / state

Farmers: సర్వం కోల్పోయాం.. సర్కారు ఆదుకోకపోతే చావే శరణ్యం - రాలిన పంటను చూసి లబోదిబోమంటున్న రైతులు

Crops Damaged in Warangal District: అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్ల వానలకు నేలకొరిగిన పంటలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందిన పంట చేజారిపోయిందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రూ.వేలకు వేలు పెట్టుబడి పెడితే ఆరుగాలం కష్టం వరదపాలైందని.. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆగమవటం ఖాయమని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Crop Damage
Crop Damage
author img

By

Published : Apr 27, 2023, 12:59 PM IST

చేతికొచ్చిన పంట.. చేజారిపోయే.. కేసీఆర్ సారూ మమ్మల్ని ఆదుకోండి..!

Crops Damaged in Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు, వడగండ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. నిన్నటి వరకూ ఏపుగా పెరిగి కళకళలాడిన వరి.. ఈదురుగాలులు, రాళ్ల వానలతో గింజన్నదే లేకుండా పోయింది. చేలన్నీ చేతికందకుండా పోయాయి. జనగామ జిల్లాలో వర్షాలకు వరి పైరు అధికంగా దెబ్బతింది. ఇప్పటికీ.. నీళ్లలోనే చేలన్నీ నానుతున్నాయి. ఈదురుగాలుల ఉద్ధృతికి నేలకొరిగిన పంటను చూసి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. మక్క పంట చాలా చోట్ల దెబ్బతింది. మట్టిలో కలిసిపోయిన మక్కలు ఎందుకూ పనికిరావని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.

బస్తాల్లో ధాన్యానికి మొలకలు.. తడిసిన పంటను కొనే దిక్కులేదు: జనగామ జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరి, 232 ఎకరాల్లో మక్కలు.. వెయ్యి ఎకరాల్లో మామిడికి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. హనుమకొండలో 21 వేలు, వరంగల్‌లో 10 వేలు, మహబూబాబాద్‌లో 11 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. అంతా సజావుగా ఉంటే మరో వారంలో కోతలు మొదలై ధాన్యం అమ్ముకునేవారు. ముందుగా పంట కోసుకున్న కర్షకులు.. కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసిపోయి నష్టపోయారు. బస్తాల్లో ఉన్న ధాన్యానికి మొలకలు వస్తున్నాయని.. తడిసిన పంటను కొనే దిక్కులేదని అన్నదాతలు వాపోతున్నారు.

రోడ్డెక్కిన రైతులు.. యత్రాంగం తీరుపై నిరసన: ఇంత నష్టం జరిగినా.. కల్లాల్లు, పొలాల్లోకి అధికారులు వచ్చిన పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల రోడ్డెక్కిన రైతులు.. యంత్రాంగం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు రాక అప్పుల్లో కూరుకుపోయామని ప్రభుత్వమే సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. 80 శాతం మేర పంట నష్టపోయామని వాపోతున్నారు. వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ల ఖర్చు తడిసి మోపెడవుతోందని అంటున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తాయని భయపడి ఆగమేఘాలపై కొందరు పంటను కోస్తున్నారు.

ఆరు నెలల నుంచి పంటకు పెట్టుబడి పెట్టుకుంటా వచ్చాం. అకాల వర్షాలు వచ్చి మమ్మల్ని సర్వం నాశనం చేశాయి. పొలంలో ఉన్న 10 శాతం కూడా బాధతోనే కోస్తున్నాం తప్పా.. అందులో మాకు మిగిలేది ఏమి లేదు. మేము కౌలు రైతులం.. ఎకరానికి రూ.15 వేలు కౌలు తీసుకుని పంట వేశాం. పంట పండించిన కూడా చేతికి రాకుండా పోయింది. ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. -రైతు

మిర్చి, మొక్కజొన్న, మామిడికి తీవ్రం నష్టం: నర్సంపేట నియోజకవర్గంలో వడగళ్ల వానకు మిర్చి, మొక్కజొన్న, మామిడి తోటలతో పాటు కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలతో పాటు పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

వడగండ్ల వాన వచ్చి పంట మొత్తం నేలపాలైంది. 80 శాతం దాకా నష్టమే. 20 శాతం ఉంటే దానికి మిషన్లు, ట్రాక్టర్లకే సరిపోతుంది. మేము కౌలు రైతులం.. ఏటా కౌలు చేసుకుంటూ వస్తున్నాం. వెంటనే దీనిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. మమ్మల్ని కేసీఆర్ సార్ ఆదుకోవాలని కోరుతున్నాం. -రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.