వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, వరంగల్, కాజీపేట తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన భారీగా పడింది. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు నీట మునిగాయి. వరంగల్ దయానంద కాలనీలో చెట్లు నేలకూలాయి. ఓసీటీ హనుమాన్ జంక్షన్‌లో వందేళ్లనాటి రావిచెట్లు కూలిపోయింది. అజాంజాహి మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో షెడ్లు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు పడిపోయాయి. వేలేరు మండంలో గాలివానతో పలు చోట్ల చెట్లు కూలి కరెంట్ తీగలపై పడగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ప్రధాన రహదారిలోని జానపాక వద్ద ఈదురుగాలులుకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. రాయపర్తి మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి చెట్ల కొమ్మలు పడిపోయాయి.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'