ETV Bharat / state

వరంగల్​లో లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు - సీపీ రవీందర్​ తాజా వార్తలు

వరంగల్​ నగర కమిషనర్​ రవీందర్​ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సీపీఐ (ఎంఎల్​) న్యూడెమెక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమ భాస్కర్​ అలియాస్​ సూర్యం, మహమూబాబాద్​ జిల్లా కమిటీ సభ్యుడు ప్రతాప్​లు అజ్ఞాతంలో ఉండి ఏం సాధించలేమని గ్రహించి లొంగిపోయినట్లు రవీందర్​ తెలిపారు.

వరంగల్​లో లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

author img

By

Published : May 14, 2020, 3:00 PM IST

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్‌-ఖమ్మం జిల్లాల కార్యదర్శి సోమ భాస్కర్‌ ఆలియాస్ సూర్యంతో పాటు మహబూబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ప్రతాప్ ఆలియాస్ శ్యాంలు అజ్ఞాతంలో ఉండి ఏం సాధించలేమని గ్రహించి.. వారు లొంగిపోయారని వరంగల్‌ నగర పోలీస్ కమిషనర్‌ రవిందర్‌ తెలిపారు. వారిద్దరిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

సోమ భాస్కర్‌ అలియాస్​ సూర్యం చదువుతున్న సమయంలోనే పార్టీ పాటలకు, ఉపన్యాసాలకు ఆకర్షితుడై 1998 సంవత్సరంలో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని సీపీ పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో కొత్తగూడ మండలం ఇసుకమీద గుట్ట వద్ద పోలీసులపై కాల్పులు జరుపడంతో పాటు అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడేవాడని తెలిపారు.

సూర్యంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 కేసులు ఉన్నాయని సీపీ వెల్లడించారు. మహబూబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ప్రతాప్ ఆలియాస్ శ్యాం న్యూడెమోక్రసీ పార్టీకి సానుభూతిపరుడిగా పని చేశారన్నారు. సూర్యం ప్రోత్సహంతో 2005లో దళ సభ్యుడిగా పార్టీలో చేరడని పేర్కొన్నారు. ఇతను పది నేరాలలో నిందితుడని రవీందర్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.