వరంగల్‌కు చెందిన ఇద్దరు సోదరులు అంతర్జాతీయ వేదికపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో సత్తా చాటారు. వరంగల్‌కు చెందిన తడుక వినూతన్, సురేఖ దంపతుల కుమారులు ప్రద్యున్(3వ తరగతి), మృణాల్(7వ తరగతి)లు ఇటీవల అమెరికాలోని సిటీ కౌన్సిల్ ఆఫ్ పిట్స్‌బర్గ్ పాఠశాలలో నిర్వహించిన వరల్డ్ యూత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పోటీల్లో రజత పతకం సాధించారు. ‘
కేర్ ఫర్ లెర్నింగ్ డిసేబిలిటీ చిల్డ్రన్’ పోటీలో కృత్రిమ మేధస్సు ద్వారా మానసిక, శారీరక వికలాంగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రద్యున్, హృతికా హనికట్టా ప్రాజెక్టు రూపొందించారు. అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ఏవిధంగా జాగ్రత్త పడవచ్చో తెలియజేస్తూ(ఫైటింగ్ ఫారెస్టు ఫైర్స్) మృణాల్, సూరజ్ ప్రజ్వాల్ అండే ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టులకు గైడ్‌గా హైదరాబాద్‌కు చెందిన స్కిల్ ఎడ్యువర్సిటీ సీఈవో పృథ్వి కొక్కొండ వ్యవహరించారు. ఈనెల 10న విడుదల చేసిన ఫలితాల్లో వేర్వేరు విభాగాల్లో ప్రద్యున్, మృణాల్‌లు వెండి పతకాలను సాధించారు.
ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?