వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి 14వరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో అధిక సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. బస్సులు అధికంగా తిప్పుతున్నప్పటికీ ప్రయాణికులు లేక ఆదాయం మాత్రం రావడం లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణ ప్రాంగణాల్లో పోలీసు బలగాలను కట్టుదిట్టం చేశారు.
ఇవీ చూడండి: నీరు, గాలి, నేలపై 'రష్యా' అణు యుద్ధ విన్యాసాలు!