ETV Bharat / state

ఖజానా శాఖలో డిజిటల్‌ విధానం - వరంగల్‌ అర్బన్‌ జిల్లా

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖజానా శాఖలో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి డిజిటల్‌ చెక్కులను మాత్రమే ఆమోదించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ట్రెజరీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఖజానా శాఖలో డిజిటల్‌ విధానం
author img

By

Published : Jul 7, 2019, 10:40 AM IST

Updated : Jul 7, 2019, 12:27 PM IST

జిల్లా ఖజానా శాఖలోని పీడీ డ్రాయింగ్‌ (ప్రభుత్వ ఖజానా శాఖ ద్వారా చెక్కులు డ్రా చేసే వారు) అధికారులు అంతర్జాలంలోని ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ విధానం(ఐఎఫ్‌ఎంఐఎస్‌) ద్వారా చెక్కులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మార్పులు, చేర్పులకు, ఫోర్జరీలకు అవకాశం ఉండదు. ఈ విధానం పారదర్శకంగా ఉండటమే కాకుండా... విలువైన సమయం వృథా కాకుండా అధికారులకు కలిసి వస్తుంది.

ఆన్‌లైన్‌ విధానం

ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల అభివృద్ధి నిధులతోపాటు, గ్రామ పంచాయతీల నిధులను పీడీ డ్రాయింగ్‌ అధికారులు ఖజానా శాఖ చెక్కులతోనే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సగటున ప్రతి నెల రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఆరు జిల్లాల పరిధిలో సుమారు 2500 మంది పీడీ డ్రాయింగ్‌ అధికారులు ఉన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీడీవోలు, కలెక్టర్లు, సీపీవోలు, కమిషనర్లు, జిల్లా పరిషత్తు సీఈవోలు, న్యాయ శాఖ, గ్రంథాలయ సంస్థ, నగర పాలక సంస్థ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు, కేయూ, కాళోజీ విశ్వవిద్యాలయం, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీఆర్‌డీవోలు మొదలైన వారందరూ జారీ చేసే చెక్కులను పీడీ డ్రాయింగ్‌ అధికారులు పరిశీలిస్తారు. వీరు ఆన్‌లైన్‌ ద్వారా ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

సంతకం సరిపోలితేనే
డిజిటల్‌ చెక్కుల జారీలో మాదిరి సంతకం తప్పనిసరి. అంతర్జాలంలో చెక్కుల జారీకి ఆమోదం తెలపాలంటే ముందుగా సంబంధిత పీడీ డ్రాయింగ్‌ అధికారులు వారి సంతకాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ చెక్కులను జారీ చేయాలి. వారి సంతకం సరిపోలితేనే ఖజానా శాఖలో ఆమోదం లభిస్తుంది. ఈ విషయంలో డీడీవోలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. దీనికి అవసరమైన చర్యలు డ్రాయింగ్‌ అధికారులు చేపట్టాలి.

డిజిటల్‌ విధానంలో చెక్కుల జారీ...
ముందుగా పీడీ డ్రాయింగ్‌ అధికారులు తెల్ల కాగితంపై సంతకం చేసి దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక చెక్కు మీద ఇద్దరు అధికారులు, లేదా ఇద్దరు ప్రజాప్రతినిధులు (సర్పంచి, ఉపసర్పంచి) మొదలైన వారు సంతకాలు చేయాల్సి వస్తే వారివి విడిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని స్పెసిమన్‌ సంతకాలుగా భావిస్తారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఖజానా శాఖ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

నిధులు జమ
ఖాతా చెల్లింపు చేసేటప్పుడు వీరు ఆన్‌లైన్‌లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత డిజిటల్‌ చెక్‌ వస్తుంది. ఈ చెక్‌పై సంతకం చేసిన పీడీ డ్రాయింగ్‌ అధికారి ఖజానా శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఆ శాఖలోని డీడీవోలు (డ్రాయింగ్‌ డిస్బర్సింగ్‌ అధికారులు) వీరు చెక్‌లను పరిశీలిస్తారు. అనంతరం అది రెండో స్థాయికి వెళ్తుంది. మొదటి స్థాయిలో ఆడిటర్‌ (శాఖ పరిధిలో అకౌంట్స్‌ చూసే అధికారి), రెండో స్థాయిలో ఆ శాఖ ఉన్నతాధికారి, మూడో స్థాయిలో ఖజానా శాఖ అధికారులు ఈ డిజిటల్‌ చెక్కులను అన్ని రకాలుగా పరిశీలించి పాస్‌ చేస్తారు. తరువాత ఆర్‌బీఐకి ఈ కుబేర్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో నిధులు జమ చేస్తారు.

ఇదీ చూడండి : కుక్కల దాడిలో 140 గొర్రెలు మృతి

Last Updated : Jul 7, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.