వరంగల్లో తెరాస జిల్లా కార్యాలయానికి జడ్పీ ఛైర్మన్ శంకుస్థాపన - ఆరూరి రమేష్
వరంగల్లో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ శంకుస్థాపన చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయానికి భూమిపూజ కార్యక్రమం పండుగలా జరిగింది. జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేశ్, కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల శంకుస్ధాపన శుభపరిణామం అని జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ అన్నారు. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలందిరికీ అందించటానికి పార్టీ కొత్త కార్యాలయాలు దోహదం చేస్తాయని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఇవీ చూడండి: బురద మడుగులో 'కేసార్డ్ ఓంజీ' ఉత్సవాలు