ETV Bharat / state

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస ఇన్​ఛార్జులు - పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస పూర్తిస్ధాయిలో కార్యాచరణ చేపడుతోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్​ఛార్జులను నియమించారు.

trs party appointed  incharges for graduate MLC elections
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస ఇన్​ఛార్జులు
author img

By

Published : Sep 27, 2020, 5:19 AM IST

తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి శాసనసభ నియోజకవర్గాల వారిగా ఇన్​ఛార్జులను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నియమించారుయ. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియమించిన నియోజకవర్గ బాధ్యుల పేర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. నియోజకవర్గ ఇన్​ఛార్జులు ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో తెరాస అభ్యర్ధుల భారీ మెజార్టీకి కృషి చేస్తారని ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.

నియోజకవర్గాల వారీగా బాధ్యులు

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి- వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యాసంస్ధలు, ఉద్యోగ సంఘాలు
  • పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ- జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు
  • పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ- స్టేషన్ ఘన్ పూర్
  • బోడకుంటి వెంకటేశ్వర్లు, మండలి చీఫ్​ విప్- పరకాల, వర్ధన్నపేట
  • ఎంపీ పసునూరి దయాకర్, వికలాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి- భూపాలపల్లి
  • ఎంపీ మాలోత్ కవిత, రైతు విమోచన సంస్ధ ఛైర్మన్ నాగూర్ల వెంకన్న- నర్సంపేట, ములుగు నియోజకవర్గాలు
  • మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్, రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్- మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు

ఇవీ చూడండి: ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కవిత... ఎన్నిక లాంఛనమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.