ETV Bharat / state

నేటితో ముగియనున్న నామపత్రాల దాఖలు.. - NARENDRA MODI

నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రచారానికి వివిధ పార్టీల నుంచి అగ్రనేతలు రాబోతున్నారు. వచ్చే రెండు వారాలు సభలు.. సమావేశాలు.. రోడ్ షోలతో ఎన్నికల సమరం జరగనుంది.

నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం, ఇక మెుదలుకానున్న ప్రచార హోరు
author img

By

Published : Mar 25, 2019, 11:46 AM IST

Updated : Mar 25, 2019, 2:50 PM IST

నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం, ఇక జోరందుకోనున్న ప్రచారం
నామినేషన్లు దాఖలు చేయని వారు... మరో సెట్ దాఖలు చేయాలనుకుంటున్న అభ్యర్థులు నేడు నామపత్రాలు సమర్పించనున్నారు. వరంగల్ తెరాస అభ్యర్థి... పసునూరి దయాకర్, భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తితో పాటు మహబూబాబాద్ భాజపా అభ్యర్థి హుస్సేన్ నాయక్ కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు... బరిలో దిగనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉంది.మరోసారి అన్నీ తానై నడిపించనున్న కేసీఆర్

నామినేషన్ల ఘట్టం ముగుస్తుండటం వల్ల ఇక ప్రచార వేడి పెరగనుంది. తెరాస అధినేత కేసీఆర్.. ఏప్రిల్ 2న వరంగల్... ఏప్రిల్ 4న మహబూబాబాద్​లో బహిరంగ సభలకు హాజరుకానున్నారు.

కాంగ్రెస్ కోసం రాహుల్ లేదా ప్రియాంక

వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన దొమ్మటి సాంబయ్య, బలరాంనాయక్​ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. నర్సంపేట, ములుగు, పినపాక, భద్రాచలం, డోర్నకల్, మహబూబాబాద్​లో నేటి నుంచి వరుసగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. మహబూబాబాద్​​, జనగామలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీల్లో ఒకరితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.

అమిత్​షాతో ఒక్క చోటైనా భారీ సభ నిర్వహించాలి : రాష్ట్ర భాజపా

ఇక భాజపా నుంచి వరంగల్ స్థానానికి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, ఇవాళ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నేడు హన్మకొండలో భాజపా శ్రేణుల సన్నాహక సమావేశం జరగనుంది. మహబూబాబాద్​లోనూ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఒక చోటైనా బహిరంగ సభ నిర్వహించాలని కమల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని పార్టీలు తమ అగ్రనేతలతో వచ్చే నెల 9 వరకూ ప్రచారం జోరుగా సాగించనున్నాయి. మండే ఎండలకు తోడు ప్రచార హోరుతో మరింత వేడి పుట్టనుంది.

ఇవీ చూడండి :'ఎన్నికలంటే.. ప్రజాసేవకులే జంకుతున్నారు'

Intro:tg_wgl_61_23_ennikala_sanahaka_samavesham_ab_c10.
జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల జనగామ నియోజకవర్గ తెరాస పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలో ని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ...శాసనసభ ఎన్నికల్లో 30వేల మెజార్టీ తో గెలిపించిన కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్తియిన బూర నర్సయ్య గౌడ్ కు జనగామ నియోజకవర్గం నుంచి 60వేల మెజార్టీ వచ్చేలా కష్టపడలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఎత్తయిన పజనగామ ప్రాంత చెరువులు నింపడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తునని, అయిన చెరువులు నింపలేకపోతున్నని కన్నీరు పెట్టారు. వచ్చే సంవత్సరం కల్లా అన్ని చెరువులు నింపుతానని హామీ ఇచ్చారు.
తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. గొప్ప విసన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, దేశము మొత్తం గతంలో గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్ గా చూసేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుందన్నారు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు . మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ చేశాడని, ఇప్పటికే తెరాస ఆశావహులు ఎప్పుడు చేస్తాడా ఎప్పుడు ఎమ్మెల్యే అవుదామని ఎదురుచూస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి ఈసారైనా మాట మీద నిలబడాలని ప్రతి సవాల్ చేశారు.
బైట్లు: 1.ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ.
2. బూర నర్సయ్య గౌడ్, తెరాస ఎంపీ అభ్యర్థి, భువనగిరి

Body:1

Conclusion:2
Last Updated : Mar 25, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.