దిశ ఎన్కౌంటర్తో కొందరికి మాత్రమే న్యాయం జరుగుతుందని, అందరికి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హత్యాచారాలకు బలైన మహిళలందరికీ ఒకే విధంగా న్యాయం జరగాలని కోరారు. ఇటీవలి వరంగల్లో హత్యాచారానికి గురైన యువతి ఘటనలో విచారణ ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.
దిశ ఘటనలో ఏ విధంగా సత్వర న్యాయం చేశారో.. తన కూతురి విషయంలో కూడా నిందితులను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేసింది.