నాలుగు అపార్ట్మెంట్లలో చోరీలు వరంగల్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రాత్రి నాలుగు అపార్ట్మెంట్లలో చోరీకి పాల్పడ్డారు. హంటర్ రోడ్లోని వీఎంఆర్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ప్లాట్లో సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. మరో చోట బంగారం, నగదు కాజేశారు. ఆందోళనకు గురైన బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి:పెరుగుతున్న కారు జోరు