ఈనాడు-కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యపై సమగ్ర అవగాహన సదస్సు "దశ-దిశ" పేరుతో ఏర్పాటు చేశారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలు కళాశాలల నుంచి సుమారు 600 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.
నిట్ ప్రొఫెసర్ ఆనంద్ రాజ్, కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు డా.రామక్రిష్ణ, డా. భాషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉన్నత విద్య ఆవశ్యకత, ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఎటవంటి విద్యాసంస్థలో చేరాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఇదీ చూడండి : తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్