గో సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని గో సంరక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు.
గోపూజ నిర్వహించి గోవులకు పండ్లు ఆహారంగా అందించారు. పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గో సంరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. మూగ జీవాలపై ప్రేమగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.