కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాదని చెప్పి.. కేంద్రం ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్లతో కలిసి వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా కేంద్రం.. తెలంగాణకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు వినోద్. కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర రైల్వే శాఖ తేల్చి చెప్పడంతో.. భాజపా మోసపూరిత వైఖరి మరోసారి స్పష్టమైందన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా ప్రాజెక్టును అటకెక్కిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుంటే.. భాజపా, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎంపీ పసునూరి దయాకర్ పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చే పోరాటంలో అందరూ కలసి రావాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కోల్పోయిన దానికంటే గొప్పగా ఇస్తాం: సీఎం కేసీఆర్