వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పేదలు, కార్మికులకు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఏ ఒక్కరు ఇబ్బంది పడకూదన్న సీఎం ఆదేశాల మేరకు సరకులు అందజేశామని తెలిపారు.
కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలన్నారు.