లాక్డౌన్ వల్ల ఉపాధి లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున రంజాన్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేద ముస్లింలకు నిత్యావసరాలు అందజేశారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను దరిచేరనీయకుండా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'