vaccination: కరోనా కట్టడిలో భాగంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15 నుంచి 17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో ఈ కేటగిరీలో 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా రికార్డు సాధించింది. జిల్లాలో 55,694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధరించగా.. లక్ష్యానికి మించి 101 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 56,299 డోసులు పంపిణీ చేశారు.
హనుమకొండ జిల్లా సాధించిన రికార్డుపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: