ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులు అవగాహన ర్యాలీ - students rally against plastic
'మా పాఠశాల ప్లాస్టిక్ రహిత పాఠశాల' అంటూ హన్మకొండలోని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మిద్దామంటూ నినదించారు.
ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులు అవగాహన ర్యాలీ
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన ర్యాలీ చేశారు. స్కూలు నుంచి కాళోజీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వద్దు... పర్యావరణం ముద్దు, ప్రాణాంతక ప్లాస్టిక్‌ని తరిమికొడదాం... ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మిద్దాం అనే నినాదాలతో ముందుకు సాగారు.
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యార్థులకు అవగాహన కల్పించి... వారి కుటుంబ సభ్యులకు కూడా ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గురించి వివరించేలా తయారుచేస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
sample description