వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం నుంచి కాళోజి కూడలి వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెండింగ్లో వున్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇవీ చూడండి: మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లు