ఉద్యోగులకు పీఆర్సీ పెంచడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
విద్యార్థులకు నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వారు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచటంపై వరంగల్లో ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు హన్మకొండలోని కరీంనగర్ ప్రధాన రోడ్డుపై ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆందోళనతో ట్రాఫిక్ జాం కావడంతో... పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగ విరమణ వయస్సు పెంచటం అన్యాయం'