ETV Bharat / state

హన్మకొండ ఎస్​ఆర్ యూనివర్సిటీలో విషాదం - పరీక్షలో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide in SR University Hanmakonda : క్షణికావేశంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ బంగారం లాంటి భవిష్యత్​ను​ నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే మానసిక స్థైర్యం కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్బశోకం మిగులుస్తున్నారు. పరీక్షల్లో తప్పినందుకు దీప్తి రాథోడ్ అనే అగ్రికల్చరల్​ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది.

student suicide hanmakonda
Student Suicide in SR University Hanmakonda
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 1:23 PM IST

Student Suicide in SR University Hanmakonda : తాత్కాలిక సమస్యకు ఆత్మహత్యే శాశ్వత పరిష్కారమనుకుని కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు(Student Suicide) పాల్పడుతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ రాయాల్సిందిపోయి జీవితం అంతే అనుకుని అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కన్నవాళ్లకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పరీక్షల్లో తప్పినందుకు హనుమకొండ జిల్లా అనంతసాగర్​లో దీప్తి రాఠోడ్ అనే విద్యార్దిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం విద్యార్థిని ఎస్​ఆర్ యూనివర్శిటీలో(SR University Hanmakonda) అగ్రికల్చరల్ బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లే హడావుడిలో ఉన్నారు.

ఈ క్రమంలో అందరూ ఇంటికి వెళ్తుండగా దీప్తి ఇంకా బయటకు రాలేదని ఇవాళ ఉదయం ఆమె కోసం స్నేహితురాళ్లు ఆమె గదికి వెళ్లారు. గదిలో ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం చూసి షాకయ్యారు. వెంటనే వారు యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్ధలికి చేరుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో విద్యార్ధిని ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురై చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం దీప్తి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార‌్చురీకి తరలించినట్లు వెల్లడించారు.

జ్యోతిషం నమ్మొద్దన్నందుకు ఒకరు, చట్నీ ఎక్కువగా వేశావన్నందుకు మరొకరి ఆత్మహత్య

ట్రాన్స్​జెండర్​గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.