వరంగల్ నగరంలో నాలాల ఆక్రమణలపై వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాలపై ఉన్న ఆక్రమణలను వెంటనే కూల్చివేయలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాలైన అమరావతి నగర్, సమ్మయ్య నగర్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మేయర్ పర్యటించారు. డ్రైనేజీలు, నాలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. భారీ వరదలతో ఇళ్లు కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరారు. స్పందించిన మేయర్ నాలాలపై అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిపారు. నాలాల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన