వరంగల్ అర్బన్ జిల్లాలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యటించారు. ఖాజీపేట మండలం రాంపూర్‌లోని డంపింగ్ యార్డుని పరిశీలించారు. చెత్త తరలింపు, డంపింగ్ యార్డ్ నిర్వహణ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాల నిర్వహణ వంటివాటిలో సాంకేతిక అంశాలను వినియోగించాలన్నారు.
డంపింగ్ యార్డ్‌లోని ఖాళీ ప్రదేశంలో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని పలు అభివృద్ధి పనుల పరిశీలన తర్వాత రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఇతర శాఖల అధికారులు ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు.