తెలంగాణ ఇంద్రకీలాద్రిగా విరాజిల్లుతోన్న ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో శాకాంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కపాలిని అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. కపాలిని అవతారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఇవీ చూడండి: కొలిక్కిరాని చర్చలు... అయోమయంలో ప్రజలు...!