ఈనెల 5వ తేదీ నుంచి జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్ ప్రారంభించారు. జాతరకు వచ్చే కోట్ల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ చీఫ్‌విప్ తెలిపారు. ప్రతి రోజు లక్షాపది వేల మందిని తరలించే విధంగా బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
క్యూ లైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలనూ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుంచి రోజూ 335 బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.