వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ కోటలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. శిలలపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు చూపరులను కట్టిపడేస్తోంది. సుందరమైన కాకతీయ శిల్పాల నడుమ తెల్లని పొగమంచు చేరి.. ఆ అందాలను మరింత మనోహరంగా మార్చేసిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి.
సాధారణం కంటే 5 నుంచి 7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. మరోవైపు భూపాలపల్లి- వరంగల్ ప్రధాన రహదారిపై పొగమంచు విపరీతంగా కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: మన్యంలో మంచు వర్షం.. వణికిస్తున్న చలి