ETV Bharat / state

ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభిమానులతో నేడు షర్మిల భేటీ

తెలంగాణలో పార్టీ స్థాపనకు ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల నాయకులు, అభిమానులతో సమావేశమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఈరోజు షర్మిల భేటీ కానున్నారు.

sharmila-meets-warangal-district-fans-today
ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభిమానులతో నేడు షర్మిల భేటీ
author img

By

Published : Mar 10, 2021, 6:55 AM IST

Updated : Mar 10, 2021, 10:07 AM IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులతో బుధవారం వైఎస్‌ షర్మిల భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించనున్న సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి హాజరయ్యే ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమవుతారని షర్మిల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు ముఖ్య నేతలు 1100 మందితోపాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విజయమ్మను కలిసిన రాఘవరెడ్డి

విజయమ్మను కలిసిన రాఘవరెడ్డి

ర్మిల సమావేశాలు, భేటీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆమె మద్దతుదారుడు కొండా రాఘవరెడ్డి మంగళవారం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మను లోటస్‌పాండ్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఆమెతో చర్చించారు. దేవుడు అంతా మంచే చేస్తారని ఆమె ఆశీర్వదించినట్లు ఆయన వెల్లడించారు.

Last Updated : Mar 10, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.